గ్రూప్ 2, పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు రెండునెలల పాటు వాయిదా
గ్రూప్ 2, పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు రెండునెలల పాటు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం TSPSC ని కోరింది. గ్రూప్ పోస్టులను పెంచిన తర్వాత పరీక్షలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఏ ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉందో నోటిఫై చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పోస్టులు పెంచాలని కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాలు సీఎం కేసీఆర్ ను కలిసి పోస్టులు పెంచే విషయమై ఆలోచించాలని కోరాయి. ఎస్ఐ పరీక్షలో ఇంగ్లీష్ పేపర్ కు వెయిటేజీ నిబంధనను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఉన్న సమయంలో రాష్ట్ర నియామక పరీక్షలు జరపవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు.
No comments:
Post a Comment