రాజ్యాంగ నిర్మాత, 'భారతరత్న' డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)లోనూ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ శనివారం వెల్లడించారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నింపడం, అసమానతలు రూపుమాపడంతోపాటు పేదరిక నిర్మూలనకూ అంబేద్కర్ విశేష కృషిచేశారని, ఆయన అందించిన స్పూర్తి నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని, అందుకే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ జయంతివేడుకలను నిర్వహిస్తున్నామని అక్బరుద్దీన్ వెల్లడించారు..
బీఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడేలో 1891 ఏప్రిల్ 14న జన్మించారు. న్యాయ కోవిదుడిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా, స్వాతంత్ర్యోద్యమంలో దళిత నాయకుడిగా నేకాక ఆంథ్రోపోలజిస్ట్ , హిస్టారియన్, బెస్ట్ స్పీకర్, రైటర్, ఎకానమిస్ట్, ఎడిటర్, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్తగా ఖ్యాతిపొందిన అంబేద్కర్ 1956లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం 1990లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' పొందారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ గురిoచి తెలుసుకోవాల్సిన అంశాలు
జీవన చిత్రం
☞ తల్లిదండ్రులు :- తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.
☞ జననం:- 14 ఏప్రిల్ 1891
☞ ప్రాంతం :- మావ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)
☞ వివాహం:-
* రమాబాయి అంబేద్కర్:- 1906 లో వివాహం జరిగింది, ఆయన ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు., చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో చనిపోయారు.
* సవిత అంబేద్కర్ :- అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..
☞ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు, నిద్రలేమి, మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు .
తన ఆఖరి పుస్తకం "Buddha and his Dhamma" పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు
బాబాసాహెబ్ చదువులు - ప్రత్యేకతలు
✍ మెట్రికులేషన్ -1908
✍ B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
✍ M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
✍ Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
✍ D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
✍ M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
✍ Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
✍ Political Economics - Germany.
✍ LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India.
✍ D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.
✍ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు., ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.
తెలిసిన బాషలు
- మరాఠీ
- హిందీ
- ఇంగ్లీషు
- గుజరాతీ
పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )
- సంస్కృతం
- జర్మన్
- పార్శీ
- ఫ్రెంచ్
ఉద్యమ జీవితం
బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు:-
1. బహిషృిత హితకారిణి సభ :- జులై 20, 1924
2. సమత సైనిక్ దళ్ :- మార్చి 13, 1927
బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు:-
1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)-- ఆగస్టు 16, 1936
2. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)-- జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)
3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) - అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)
బాబాసాహెబ్ స్థాపించిన విధ్యా సంస్థలు
1. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూన్ 14, 1928
2. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూలై 08, 1945
3. సిద్ధార్థ్ కాలేజి, ముంబై -- జూన్ 20, 1946
4. మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ -- జూన్ 01, 1950
☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ
1. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా -- మే 4, 1955
బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు
- మహద్ చెరువు ఉద్యమం -20/3/1927
- మొహాళీ (ఘులేల)తిరుగుబాటు -12/2/1939
- అంబాదేవీ మందిరం ఆందోళన -26/7/1927
- పూణే కౌన్సిల్ ఉద్యమం - 4/6/1946
- పర్వతీ ఆలయ ఉద్యమం -22/9/1929
- నాగపూర్ ఆందోళన - 3/9/1946
- కాలారామ్ ఆలయ ఆందోళన -2/3/1930
- లక్నౌ ఉద్యమం - 2/3/1947
- ముఖేడ్ ఉద్యమం -23/9/1931
బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు
*- మూక్ నాయక్ - జనవరి 31, 1920
*- బహిషృిత భారత్ - ఏప్రిల్ 3, 1927
*- సమత - జూన్ 29, 1928
*- జనత - నవంబరు 24, 1930
*- ప్రభుద్ధ భారత్ - ఫిబ్రవరి 4, 1956
బాబాసాహెబ్ ప్రత్యేకతలు - దక్కిన గౌరవాలు
☞- బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే..
☞- లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్
☞- ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్
☞- ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు
☞- లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి
☞- తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు.
అరుదైన గౌరవాలు
☞- భారత రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం
☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు
☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత
☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN
No comments:
Post a Comment