Thursday, 19 May 2016

ల్యాప్ టాప్ కొనాలంటే ముందు దాని గురించి

ల్యాప్ టాప్ కొనాలంటే ముందు దాని గురించి కనీస అవగాహన ఉండాలి. ఏ కంపెనీదైతే బెస్ట్ ? ఎంత ర్యామ్ ఉండాలి ? స్క్రీన్ సైజ్ ఎంత ఉండాలి ? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకుని కొనాలి. లేకపోతే కొన్న తర్వాత లబోదిబోమనాల్సి వస్తుంది. అలాంటి కొన్ని ఉపయోగపడే టిప్స్ మీకోసం...
డిస్ ప్లే: ల్యాప్ టాప్‌లో ప్రధానంగా చూడాల్సింది డిస్‌ప్లే. ఐపీఎస్ డిస్‌ప్లే ఉన్న ల్యాప్‌ను కొనడం బెటర్. ఈ డిస్‌ప్లే కలిగిన ల్యాప్ టాప్స్ ఖరీదు 40వేలు పైమాటే. క్వాలిటీ కావాలంటే ఖర్చు పెట్టాల్సిందేగా.
ల్యాప్ టాప్ వెయిట్: సాధారణంగా ల్యాప్ టాప్ బరువు ఎంత ఉండాలనే దానిపై ప్రామాణికత ఏమీ లేదు. అయితే లైట్ వెయిట్ ఉండే ల్యాప్ టాప్ తీసుకుంటే మంచిదని టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్ సైజ్ 14 అంగుళాలు కానీ అంతకన్నా తక్కువ గానీ ఉండేలా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ర్యామ్: ల్యాప్ టాప్ ర్యామ్ సాధారణంగా 4జిబి ఉంటుంది. అయితే 8జిబి ర్యామ్ ఉండే ల్యాప్‌టాప్‌ను తీసుకుంటే బెటర్. యానిమేషన్, వెబ్ డిజైనింగ్ వర్క్ చేసేవారైతే 16జిబి ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ కొనుక్కుంటే బెటర్.
ప్రాసెసర్: కోర్ ఐ సిరీస్ ప్రాసెసర్ అయితే బెటరని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా వచ్చే ప్రాసెసర్ల కంటే ఇదే మంచిదని చెబుతున్నారు. ఆటమ్ ప్రాసెసర్ కంటే పెంటియమ్ ప్రాసెసర్ వేగంగా పనిచేస్తోందని టాక్.

No comments:

Post a Comment